పోలవరం నిర్వాసితుల కష్టాలు తీర్చాలంటూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా ఏపీలోని గోదావరి జిల్లాలు అపార నష్టాన్ని చవిచూశాయి. ఇటీవల గోదావరి వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. పోలవరం నిర్వాసితులకు దశలవారీగా నష్టపరిహారం అందించకుండా, అందరికీ ఒకేసారి సాయం అందించాలన్నారు. బాధితులకు మరింత పరిహారం ఇవ్వాలని కోరారు.