శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, తాను తప్పు చేయకుంటే సంజయ్ రౌత్ ఎందుకు భయపడుతున్నారని షిండే ప్రశ్నించారు. తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈడీ తన పని తాను చేసుకుంటోందని అన్నారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో షిండే ఈ వ్యాఖ్యలు చేశారు.