ఏపీలో ఆగస్టు 1 నుంచి 62,79,486 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద డబ్బులు పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. పింఛన్ల పంపిణీ కోసం రూ.1,596.77 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.
కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 రోజుల్లోగా పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించామన్నారు.