శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం సా.6గంటలకు జూరాల నుంచి 43,732 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కులు మొత్తం 77,668 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 881.50 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 196.1108 టీఎంసీలుగా నమోదైంది.