తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 18 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం శ్రీవారిని 71,450 మంది భక్తులు దర్శించుకోగా 31,320 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5 కోట్లు వచ్చిందని తెలిపారు.