చిత్తూరు పట్టణంలోని సోమవారం సాయంత్రం నుంచి నిరవధికంగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో నగర కమిషనర్ డా. జె అరుణ రాత్రి నగరంలో పలు లోతట్టు ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎమ్మెస్సార్ కూడలి వద్ద నున్న మురుగునీటి కాలువలు పరిశీలించి వర్షపు నీరు సాఫీగా వెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం అధికారులకు మార్గనిర్దేశం చేశారు.