భారత దేశవ్యాప్తంగా సోమవారం 4,11,102 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 13,734 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,792 కి చేరింది. దేశంలో గత 24 గంటల్లో 34 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,26,430 కి చేరింది.