తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.20 వేల కోట్లతో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. నగరంలో 10 కోట్ల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యంతో రెండో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్టాలిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసిన తర్వాత కొత్త విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.