“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్“ కార్యక్రమములో భాగంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా డీపీ లుగా జాతీయజెండాని పెట్టుకోవాలని ప్రధానమంత్రి మోడీ తెలియజేసిన సంగతి తెలిసిందే. అలానే స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన సమరయోధులకు నివాళులు అర్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వాతంత్ర్యోద్యమ సేనాని శ్రీ కాకాని వెంకట రత్నం జయంతి సందర్భంగా SP M.రవీంద్రనాథ్ బాబు, IPS., ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa