ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు భారీ షాక్ తగిలింది. అతడి అనుచరుడు, చోటాషకీల్ బంధువు సలీం ఖురేషీని ఎన్ఐఏ గురువారం అరెస్ట్ చేసింది. ముంబై, థానేలలో 20కి పైగా ప్రదేశాలలో ఎన్ఐఏ దాడులు చేయగా, అతడు పట్టుబడ్డాడు. దేశంలో ఉగ్ర దాడులకు దావూద్, చోటా షకీల్‌లు పాక్ నుంచి ప్లాన్ చేస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సలీం ఖురేషీ వంటి వారితో భారతదేశంలోని రాజకీయ నేతలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది.