ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీల అరెస్టుపై వెంకయ్యనాయుడు కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Aug 05, 2022, 01:17 PM

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేసే అంశంపై రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఓ ప్రకటన చేశారు. సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేయడం లేదా ప్రశ్నించరాదు అన్న అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయని, కానీ ఆ అది సరైన విధానం కాదు అన్నారు.


ఎంపీలు కూడా సాధారణ వ్యక్తుల వంటివారే అని అన్నారు. క్రిమినల్ ఆరోపణలు ఉన్న కేసుల్లో.. ఆ ఎంపీలకు సభ ఎటువంటి రక్షణ కల్పించలేదని వెంకయ్య తెలిపారు. సభకు హాజరుకావాలన్న ఉద్దేశంతో కేసుల విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చైర్మెన్ చెప్పారు. చట్టాన్ని, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన విధిగా భావించాలని వెంకయ్య తెలిపారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com