వైఎస్ఆర్ కడప జిల్లా, జమ్మలమడుగు మండలంలోని ప్రతి రైతుతప్పనిసరిగా పీఎం కిసాన్‌కు సంబంధించి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మోరగుడి రైతుభరోసా కేంద్రం వ్యవసాయ సహయకుడు సి. మాధవరెడ్డి తెలిపారు. గురువారం గ్రామంలోని ఆర్బీకే కార్యాలయంలో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. మైలవరం మండలం మోరగుడి ఆర్బీకేకు కేటాయించిన 5 టన్నుల డీఏపీని రైతులకు అందించామని, మిగిలిన రైతులకు కూడా ఎరువులు అందుబాటులో ఉంచుతామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు సాగుచేసిని పంటలను ఈ కర్షక్ ద్వారా పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు సిబ్బంది పాల్గొన్నారు