రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఓ వైపు యుద్ధం జరుగుతోంది. అయితే ఆ రెండు దేశాలకు చెందిన ప్రేమ జంటను యుద్ధం విడదీయలేకపోయింది. రష్యాకు చెందిన సెర్గీ నోవికోవ్, ఉక్రెయిన్ యువతి ఎలోనా బ్రమోకాను ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో హిందూ సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. స్థానికులు భారీగా హాజరై, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుక వీడియో వైరల్ అయింది.