ఉగ్రవాదానికి మతం ఉండదు అన్నది మరోసారి నిరూపితమైంది. ఏ మతం ముసుగుతో ఉగ్రవాదులు వేసుకొన్నారో అదే మతానికి చెందిన వారిని సైతం చంపడం మనం చస్తూనే ఉన్నాం. దీంతో మతానికి ఉగ్రవాదానికి ఏ మాత్రం సంబంధంలేదన్నది తేలిపోతుంది. ఉగ్రవాదం కేవలం తన స్వలాభం కోసమన్నది మరోమారు రుజువైంది. ఇక వివరాలలోకి వెళ్లితే...ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
ఆఫ్ఘనిస్థాన్ స్థానిక మీడియా ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద మైనారిటీ అయిన హజారాస్ జాతిని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఈ దాడికి పాల్పడింది. మసీదు వద్ద ప్రార్థనల కోసం వచ్చిన మహిళలు, చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడింది. మొత్తం రెండు పేలుళ్లు జరగ్గా ఒకటి సర్-ఇ-కరిజ్ ప్రాంతంలోని ఇమామ్ బాకిర్ అనే మహిళా మసీదులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుండగా, చనిపోయింది 20 మందని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది.