తిరుమల తిరుపతి దేవస్థానం అనుహ్య నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఏపీ వ్యాప్తంగా జరగాల్సిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం తిరిగి టీటీడీ కొత్త తేదీని ప్రకటించనుంది. 2011లో రద్దైన ఈ పథకాన్ని ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం 8.07 గంటలకు పెళ్లిళ్లు జరగాల్సి ఉండగా, వాయిదా వేసింది.