మంగళవారం మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. సీఎం ఏక్‌నాథ్ షిండే తన మంత్రివర్గ విస్తరణకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మహారాష్ట్ర మంత్రివర్గంపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు సమాచారం. ముందుగా 15 మందిని మంత్రులుగా తీసుకుంటారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.