కాలేజీ స్టూడెంట్నంటూ ఆన్లైన్లో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఓ 63 ఏళ్ల వృద్ధుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. జంబోథ్పూర్లోని సిద్ధసర్ గ్రామానికి చెందిన రసిక్ వదాలియా అనే వృద్ధుడు.. రిషి పటేల్ అనే పేరు మీద ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కొనసాగిస్తున్నాడు. అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ.. తనపై వారికి నమ్మకం కుదిరాక నగ్న చిత్రాలు పంపమని అడిగేవాడు. అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు.