"ప్రపంచ ఆదివాసీ (గిరిజన) దినోత్సవం సందర్భంగా (09.08.2022) అనగా ఈ రోజు తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్రం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కాబట్టి ప్రతి నియోజకవర్గంలో నాయకులూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. స్వతంత్ర సమరయోధులుగా కూడా పని చేసి దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా అర్పించిన వారిలో ఆదివాసీయులు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు అని గుర్తుచేశారు.