చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై టీడీపీ సోషల్ మీడియాలో, మీడియాలో రకరకాలుగా ప్రచారం చేసుకుంటోంది అని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వాపోయారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ..... వారి పబ్లిసిటీ పిచ్చి చూస్తే.. ఇదంతా చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అపాయింట్మెంట్ ఇవ్వని మోడీగారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మీకు ప్రాధాన్యత ఇస్తారా?. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి వచ్చిన అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించే క్రమంలోనే, ప్రధాని మోదీగారు చంద్రబాబుతో కూడా నిమిషమో, అర నిమిషమో మాట్లాడారు.
దానికి, టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం బ్రహ్మాండం ఏదో బద్దలైపోయిందంటూ కథనాలు ప్రసారం చేస్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎలా ఉంటుందో.. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు అని అభిప్రాయపడ్డారు.