దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16,047 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19,539 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వరుసగా రెండో రోజూ నమోదైన కొత్త కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,261కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైంది.