మధుమేహ బాధితులు మద్యం తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్న వారికి నాడులు దెబ్బతినడం, కాళ్లపై పుండు పడడం వంటివి జరుగుతుంటాయి. మద్యం తాగితే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా మద్యం తాగితే, ఖచ్చితంగా భోజనం చేయాలని ఆ తర్వాత మందులు వేసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. లేకుంటే శరీరంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోయి, హైపోగ్లైసీమియా వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు.