వంటపాత్రలలో ఉండే రసాయనాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. 'ఫర్ ఎవర్ కెమికల్స్' అని పిలుచుకునే సింథటిక్ కెమికల్స్ సాధారణంగా ఆహార పదార్థాలలోనూ, వంటపాత్రల్లో ఉంటాయని పరిశోధకులు తెలిపారు. నాన్‌స్టిక్ పాత్రలు, కుళాయిలు, సీఫుడ్, షాంపూలు, దుస్తులలో 'పర్ ఫ్లోరో ఆక్టేన్ సల్ఫేట్' వల్ల లివర్ కేన్సర్ వస్తుందని తాజాగా వారు వెల్లడించారు.