సూళ్లూరుపేట పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సూళ్లూరుపేట రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ అధ్యక్షులు కొక్కు శంకరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు సులూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం , తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో బూత్ కన్వీనర్లు నియామకం , గ్రామ పార్టీ అధ్యక్షుల నియామకం, సభ్యత్వం నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సుధాకర్ రెడ్డి శంకరయ్య కుదిరి సుబ్రహ్మణ్యం, సామంతమల్లం సుబ్రహ్మణ్యం, రమేష్ రెడ్డి మరియు సుళ్లూరుపేట మండల గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa