కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారు ప్రికాషన్ డోసుగా కార్బెవ్యాక్స్‌ను వాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సిఫార్సు మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం తెలిపింది. రెండు డోసుల వాక్సిన్ తీసుకున్న వయోజనులకు 6 నెలల తర్వాత ఈ డోసును ఇస్తారు. ప్రస్తుతం ఈ టీకాను 12-14 ఏళ్ల పిల్లలకు ఇస్తున్నారు.