సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై సీఎం జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు మేరుగ నాగార్జున, వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్ని హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు పెంచాలని, ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.