తిరుమల శ్రీవారికి పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీతో ఈ మాసం ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమల యాత్రికుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండటంతో వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావాలని టీటీడీ విన్నవించింది.