దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలు చేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆహారధాన్యాలు కావాలంటే జెండా కొనండి. లేదంటే వెళ్లండి’ అంటూ హరియాణాలోని కర్నాల్‌లో ఒక రేషన్ షాప్ డీలర్ కరాఖండీగా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.