పల్నాడు జిల్లా , చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ట మహోత్సవానికి టీడీపీ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరైనారు.
ఈ కార్యక్రమంలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి దర్శనం అనంతరం, ప్రజలకు పరమేశ్వరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రజల ఇబ్బందులను తొలగించాలని వేడుకున్నారు. వర్షాలు, వరదలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటి నుండి ప్రజలకి ఎటువంటి హాని కలగకుండా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.