జగన్ సర్కార్ పై డీపీపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు.మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైంది అని అదేవిధంగా గోరంట్ల న్యూడ్ వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై కూడ ఆగ్రహం వ్యక్తం చేసారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై వంగలపూడి అనిత అసహనం వ్యక్తం చేశారు.
గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.