రేపల్లె: బంధాలను, అనుబంధాలను గుర్తు చేయటంతో పాటు పవిత్రతను చాటి చెప్పే గొప్ప పండుగ రక్షాబంధన్ అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ కు ఆయన సోదరీమణులు పద్మశ్రీ డాక్టర్ మంజుల, డాక్టర్ కమల రాఖీ కట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్నేహితులను మనం నిర్ణయిస్తామని బంధుత్వాలు భగవంతుడు కల్పిస్తాడని అన్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన బంధాలను పటిష్ట పరుచుకోవాలన్నారు.