దేశ భవిష్యత్ నిర్ణేతలు అయిన యువతీ యువకులకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు తెలిపారు . జాతి శక్తిసామర్థ్యాలకు ప్రతీకైన యువత దురదృష్టవశాత్తు ఏపీలో గంజాయి,చీప్ లిక్కర్ల మత్తులో భవిష్యత్తును నాశనం చేసుకునే స్థితిలో ఉంది.ఉపాధి ఉద్యోగాల్లేక ఏపీ యువశక్తి నిరాశ నిస్పృహలతో కృంగిపోతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యువతకు సుమారు 12 లక్షల ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి యూనిట్లు మరెన్నో అందించాం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం యువత భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.