వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన వితరణ గుణాన్ని చాటుకొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన వంతుగా రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ టీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ఆది నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేసిన సాయిరెడ్డి... తన వంతుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.