ఢిల్లీలో శుక్రవారం 2136 కరోనా పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి, 10 మరణాలు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. పాజిటివ్ రేటు 15.02 శాతం. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 2 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా పదో రోజు. ఢిల్లీలో గురువారం 2,726 తాజా కోవిడ్ కేసులు మరియు వైరల్ వ్యాధి కారణంగా ఆరు మరణాలు నమోదయ్యాయి.