ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. గత మూడు నెలల వ్యవధిలో ఆమె కరోనా బారిన పడడం ఇది రెండోసారి. కరోనా నిర్ధారణ ఫలితాల్లో ఆమెకు పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జూన్‌లో కరోనా బారిన పడ్డ సోనియా, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న కొన్నాళ్లకే మరోసారి ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa