తిరుచానూరు పద్మావతి అమ్మవారిని శనివారం తమిళనాడు హైకోర్టు చీఫ్ జసిస్ మునీశ్వర్నాథ్ బండారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాదం మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం సిజే మాట్లాడుతూ అమ్మవారిని దర్శంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.