ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తాజాగా తన భర్తపై ఉన్న కోపాన్ని వార్త పత్రికలో యాడ్ రూపంలో ప్రదర్శించింది. ‘‘ప్రియమైన స్టీవ్, మీరు ఆమెతో సంతోషంగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో ఇప్పుడు ఊరందరికీ తెలుస్తది.. జెన్నీ’’ అంటూ యాడ్ ప్రచురించింది. మోసగాడైన భాగస్వామిపై ఆమె కోపం అంతటితోనే తీరలేదు. ‘‘పీఎస్.. నేను మీ క్రెడిట్ కార్డుతో ఈ ప్రకటన స్థలాన్ని కొనుగోలు చేశాను’’ కోపం తీర్చుకుంది.