కుప్పం పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కుప్పం వైకాపా కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలలో ఎమ్మెల్సీ భరత్ జెండా వందనం చేశారు. మునిసిపల్ కార్మికులకు, సిబ్బందికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను కట్టి దేశ భక్తిని చాటాలని భరత్ ప్రజలకు సూచించారు. కుప్పంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో జెండా పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు.