లింగాల మండలం దొండ్లవాగు గ్రామ పరిధిలో వైఎస్సార్ క్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు చీనీ చెట్ల మధ్యలో నవధాన్యాలు విత్తుకోవడం వలన నవధాన్యాల వేర్ల నుండి భూమిలో అనేకరకాల సూక్ష్మ స్థూల పోషకాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. పకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భూమికి ఎండ తగలకుండా 365 రోజులు పంటల తో కప్పి ఉంచడం వలన భూమిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది కర్బన శాతం పెరిగి జీవన ద్రవ్యం మొక్కలకు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో వైయస్సార్ క్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి, ఎన్ ఎఫ్ ఎఫ్ భాస్కర్, యూనిట్ ఇన్చార్జి నీలావతి, హారతి హాజరు కావడం జరిగింది.