కందుకూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల చిరకాల స్వప్నం రామాయపట్నం పోర్ట్ సాకారం కాబోతున్నది. గుడ్లూరు మండల పరిధిలోని మొండివారి పాలెంలో పనులు చురుకుగా ప్రారంభం కావడం విశేషం. అందుకోసం 120 టిప్పర్లు 24 గంటలూ నిర్విరామంగా పనిచేస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగవంతంగా చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.