కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం అమ్మవారిని త్రివర్ణ పతాకం రంగులతో అలంకరించడంతో భక్తులకు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అలంకరణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు చేశారు. ఇది తిలకించిన భక్తులు దేశభక్తిని చాటుకునేలా అమ్మవారి అలంకరణ ఉందన్నారు.