ఈ నెల 18 నుంచి భారత్, జింబాబ్వే జట్ల మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ కు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లాండ్లో కౌంటీ గేమ్ ఆడుతుండగా సుందర్ భుజానికి గాయమైంది. దీంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఆగస్టు 18న హరారే స్పోర్ట్స్ క్లబ్లో తొలి వన్డే జరగనుంది.