రాజస్థాన్లో దళిత బాలుడి హత్య నేపథ్యంలో లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కుల వ్యవస్థ దేశానికి ప్రధాన శత్రువుగా మిగిలిపోయిందని అన్నారు.దళిత బాలుడిని కొట్టి చంపడంపై మాజీ స్పీకర్ మీరా కుమార్ స్పందించారు. తన తండ్రి, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ను వందేళ్ల క్రితం కూడా ఇదే కారణంతో కొట్టారని మాజీ మంత్రి మీరా కుమార్ పేర్కొన్నారు. ఇటీవలే కుండలో నీళ్లు తాగాడని 9 ఏళ్ల దళిత బాలుడిని కొట్టి చంపడం దారుణమన్నారు.