తాను జెండా వందనం చేయనని ఓ మహిళ ప్రధానోపాధ్యాయురాలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి పంద్రాగస్టు రోజు స్కూల్‌కు సెలవు పెట్టారు. తాను క్రిస్టియన్‌ను అని, దేవుడికి తప్ప మరెవరికీ వందనం చేయడానికి తమ మతం ఒప్పుకోదని తమిళసెల్వి ఓ వీడియో తీసి తోటి టీచర్లకు పంపించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.