అవుకు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్లశింగవరానికి చెందిన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య స్వాతికి అన్నవరం గ్రామంలో సర్వే నంబరు 20లో కొంత పట్టాభూమి ఉంది. ఈ భూమికి సంబంధించి జరిగిన భూకొలతల్లో తనకు అన్యాయం జరిగిందని రైతు అవుకు తాసిల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాకెందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు.