కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలంలో బుధవారం పలు ప్రారంభోత్సవాల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా విశ్వనా ధ్ , జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం మర్రిపాక లో నిర్మించిన సచివాలయాన్ని మరియు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం జగ్గంపేట సచివాలయం 1 రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా చాలా ఉత్సాహంగా జరుగుతుంది. జగ్గంపేట లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు కొనసాగుతున్నారు గ్రామంలోని. మహిళలు హారతులు పడుతూ వారి దీవెనలు శాసనసభ్యులు చంటిబాబుకు అందజేసారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం, జగ్గంపేట మండల ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జగ్గంపేట మండలం జడ్పిటిసి ఒమ్ని బిందు మాధవి రఘురాం, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హేమ సైలు సుబ్బారావు, సీడ్స్ డైరెక్టర్ ఇళ్ల అప్పారావు కాపు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఊయ్యురి శివ మండలంలోని ఎంపిటిసిలు, జగ్గంపేట సర్పంచ్ బచ్చల నాగరత్నం, ఉప సర్పంచ్ బండారు రాజా, వార్డు నెంబర్లు, , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.