టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీతో విడాకులు అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. ధనశ్రీ సోషల్ మీడియాలో తన పేరును ధనశ్రీ వర్మగా మార్చుకోవడంతో ఈ గందరగోళం నెలకొంది. ధనశ్రీ డెంటిస్ట్ మాత్రమే కాదు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ కూడా కావడంతో ఆమె విడాకుల వార్తలు వివాదాస్పదమయ్యాయి. ఈ జంట విడిపోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చాహల్ తెలిపాడు.