దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 13,272 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా బారిన పడిన వారిలో 13,900ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166కు చేరుకుంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.