ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ డ్రగ్ పరీక్ష చేయించుకున్నారు. స్నేహితులతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్ చేస్తున్నవీడియో వైరల్ అవడంతో.. ప్రధాని మారిన్ డ్రగ్స్ తీసుకుని చిందులు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తానేమీ డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్ష చేయించుని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో ప్రపంచంలోనే యువ ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.