భారతదేశంలో మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది.ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, పాదాలు, నోటిపై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి. ఇప్పటివరకు కేరళ, ఒడిశాలో సుమారు 82 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది.