ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగాల్​లో టీఎంసీ కార్యకర్త హత్య

Crime |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 05:17 PM

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) కార్యకర్తను ప్రత్యర్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం బసంతిలోని భరత్‌పూర్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త జలే ఆలం ఘాజీని దుండగులు కత్తితో పొడిచారు. ఛాతిపై తీవ్ర గాయం కావడంతో రక్తం ధారగా కారి అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com